Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
పూల మాలలు
Talent:
పల్లవి : పూల మాలలు వేపాకు దండలు.. బంతి పువ్వులు తంగెడ మాలలు.. అందుకోవమ్మా యల్లమ్మా.. ఆదుకోవమ్మా దుర్గమ్మా.. నిత్య పూజలతో నిరంతరం నిన్నే కొలిచెదమమ్మా.. సత్యనాదమున అందర్ని నువ్వే నడిపించగరావమ్మా.. చరణం : 1 అరుణోదయంలా వెలుగై మారీ మమ్ము కాచవమ్మా.. అడుగెట్టి ఇచ్చట పాపాలు మాపి కరుణ చూపవమ్మా.. భక్తి జెండాలతో నీకే జయమని నీ పాటలు పాడేదము.. భవబంధాల నుండి ముక్తి ఇవ్వమని నిన్నే కోరెదము.. పల్లవి : పూల మాలలు వేపాకు దండలు.. బంతి పువ్వులు తంగెడ మాలలు.. అందుకోవమ్మా మా యల్లమ్మా.. ఆదుకోవమ్మా తల్లీ దుర్గమ్మా.. చరణం : 2 నిత్యం నీ పాదసేవే మాకు సత్యమయ్యే తల్లి.. నిత్యం నీ కృప మాపై చూపు కరుణ గల తల్లి.. కడపటి ఊపిరికీ ఆశ నువ్వే తల్లి.. కన్నీటి బాధలు రూపు మాపే తల్లీ.. పల్లవి : పూల మాలలు వేపాకు దండలు.. బంతి పువ్వులు తంగెడ మాలలు.. అందుకోవమ్మా మా యల్లమ్మా.. ఆదుకోవమ్మా తల్లీ దుర్గమ్మా.. చరణం : 3 పల్లెలో పాడెను చిన్నా పెద్దా నీ నామ గీతమే.. పట్టణమంతా ఈ జనం అంతా నీ నామమే.. బంగారు బతుకులకై ఇస్తావు నీ ఆశీర్వాదమే.. కోరిన కోర్కెలు అమ్మై తీర్చే కొంగుబంగారమే.. పల్లవి : పూల మాలలు వేపాకు దండలు.. బంతి పువ్వులు తంగెడ మాలలు.. అందుకోవమ్మా మా యల్లమ్మా.. ఆదుకోవమ్మా తల్లీ దుర్గమ్మా.. నిత్య పూజలతో నిరంతరం నిన్నే కొలిచెదమమ్మా.. సత్తనాదమున అందర్ని నువ్వే నడిపించగరావమ్మా..
Like (
2
)
Share
Basireddy Sivareddy MA.RD
Lyrics
Hyderabad
Need help