Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
మొలకెత్తని గింజ
Talent:
ఒక పెద్ద రాజ్యంలో ఒక జ్ఞానవంతుడైన రాజు ఉండేవాడు. ఆ రాజుకి వయసు పెరుగుతోంది. “నా తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలించాలి?” అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒక రోజు రాజు రాజభవనంలో ఉన్న అందరి యువకులను పిలిచాడు. వాళ్లందరికీ ఒక చిన్న గింజ ఇచ్చాడు. రాజు చెప్పాడు: “ఈ గింజను మీ ఇంటికి తీసుకెళ్లి, ఒక కుండలో నాటి, ఏడాది తర్వాత ఇక్కడికి తీసుకురండి. ఎవరి మొక్క బలంగా, అందంగా పెరుగుతుందో, అతడే ఈ రాజ్యం యొక్క వారసుడు.” అని చెప్పాడు. అందరూ ఆనందంగా గింజలు తీసుకుని వెళ్లిపోయారు. రోజులు గడిచాయి. యువకులందరూ తమ గింజలను కుండల్లో వేసి, నీళ్లు పోసి, ఎరువులు వేసి, మొక్కలు పెంచారు. కానీ వారిలో ఒక యువకుడు – పేరు సత్యం. అతను ఎంత కష్టపడినా, ఆ గింజ నుంచి ఒక్క చిన్న మొలక కూడా రాలేదు. సత్యం నిరాశ చెందాడు. కానీ తప్పుడు మార్గం పట్టలేదు. కొత్త గింజ వేసుకోవాలని అనుకున్నాడు. కానీ వెంటనే ఆగిపోయాడు. “రాజు ఇచ్చిన గింజనే పెంచాలి. అది మొలకెత్తకపోతే కూడా, నేను నిజం చెప్పాలి.” అని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తర్వాత అందరూ తమ కుండల్లో అందమైన మొక్కలతో రాజభవనానికి వచ్చారు. సత్యం మాత్రం ఖాళీ కుండ పట్టుకుని సిగ్గుగా నిలబడ్డాడు. రాజు ఒక్కొక్కరి మొక్కను చూసి చివరగా సత్యం దగ్గరకు వచ్చాడు. “నీ కుండలో ఎందుకు మొక్క లేదు?” అని అడిగాడు. సత్యం వణుకుతూ అన్నాడు: “మహారాజా, నేను ఎంతో శ్రద్ధగా నీరు పోశాను. కానీ మొలక రాలేదు. కొత్త గింజ వేసుకోవాలని అనిపించింది. కానీ అది మోసం అవుతుందని భావించి, నిజం చెప్పాలని వచ్చాను.” రాజు సంతోషంగా నవ్వాడు. “బావుంది సత్యమా! నేను మీ అందరికీ ఇచ్చిన గింజలు ఉడికించినవే. వాటి నుంచి మొక్కలు రావు. అయినా అందరూ కొత్త గింజలు వేసి మోసం చేశారు. కానీ నువ్వు నిజాయితీగా ప్రవర్తించావు. ఈ రాజ్యం పాలించే అర్హత నీకే ఉంది.” అని చెప్పి రాజ్యానికి రాజును చేసాడు. చివరగా ఈ కథలో నీతి ఏమిటి అంటే... నిజాయితీగా ఉండటం ఎప్పుడూ కష్టమనిపించినా... చివరికి మనకు గౌరవంను తీసుకొస్తుంది. ఇక కథ కంచికి మనం ఇంటికి!
Like (
2
)
Share
Basireddy Sivareddy
Story
Hyderabad
Need help