Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
డాక్టర్ బాబు
Talent:
ఒక చిన్న ఊరు… ఆ ఊరులోని రామయ్య గారు బీద రైతు. కష్టపడి పంట పండిస్తారు కానీ అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇంట్లో పిల్లల చదువులు, కడుపు నింపే బాధలు అన్నీ ఆయన భుజాలపై ఉన్నాయి. ఒక రోజు రామయ్య గారు ఊరి బజారుకు వెళ్లారు. బజారులో బతిమిలాడుతూ పుస్తకాలు అమ్ముకుంటున్న ఒక చిన్న బాబు కనిపించాడు. అతని వయసు పది సంవత్సరాలు. కళ్ళలో వెలుగు ఉంది కానీ చేతుల్లో నిస్సహాయత కనిపిస్తోంది. రామయ్య గారు దగ్గరికి వెళ్లి అడిగారు, “బాబూ… ఎందుకు ఇంత చిన్న వయసులో పుస్తకాలు అమ్ముతున్నావు?” బాబు చెప్పాడు, “నాన్న లేరు సార్. అమ్మ కూలి చేస్తుంది. నేను చదువుకోవాలని ఉంది… కానీ ఫీజులు కోసం పుస్తకాలు అమ్ముతున్నాను.” ఆ మాట విన్న రామయ్య గారికి కళ్ళలో నీళ్లు కట్టాయి. తనకున్న కష్టాలు మర్చిపోయి, వెంటనే బాబుకు రెండు పుస్తకాలు కొన్నాడు. అదికాకుండా, పక్కన ఉన్న టీ దుకాణం దగ్గర బాబుకు భోజనం పెట్టించాడు. ఆ రోజు రాత్రి రామయ్య గారు ఇంటికి వచ్చి ఆలోచించారు: “మనకి ఉన్నంతలో కొంచెం పంచుకుంటే ఎవరైనా జీవితమే మారిపోతుంది కదా.” కాలం గడిచింది. పది సంవత్సరాల తర్వాత, రామయ్య గారు వృద్ధులయ్యారు. ఒక రోజు ఊరి హాస్పిటల్లో ఆయన అనారోగ్యంతో పడిపోయారు. డాక్టర్ రాగానే రామయ్య గారు ఆశ్చర్యపోయారు – అదే బాబు… అప్పట్లో పుస్తకాలు అమ్మిన చిన్న బాబు… ఇప్పుడు పెద్ద డాక్టర్ అయ్యాడు! బాబు చిరునవ్వుతో చెప్పాడు: “రామయ్య గారు… మీరు అప్పట్లో చేసిన చిన్న సహాయం వల్లనే నేను చదివి డాక్టర్ అయ్యాను. మీకు రుణపడి ఉన్నాను.” రామయ్య గారి కళ్ళలో ఆనంద బాష్పాలు ఉబికి వచ్చాయి. చిన్న సహాయం… పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆ క్షణం ఆయనకు అర్థమైంది. ఉన్నంతలో సాయం చెయ్యండి. ఉత్తములుగా జీవించండి. ఇక కథ కంచికి మనం ఇంటికి!
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Story
Hyderabad
Need help