Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
తల్లీ దండ్రుల ఆశీర్వాదం
Talent:
ఒక చిన్న ఊర్లో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాము చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు. చదువులో బాగా ముందు ఉండేవాడు, కానీ ఇంటి పరిస్థితులు అంత మంచివి కావు. తండ్రి రైతు, తల్లి ఇంటి పనులు చేసేవారు. పేదరికం ఎంతైనా, రాము తల్లిదండ్రులు ఒకే మాట చెబుతుండేవారు: “రాము, చదువు నేర్చుకో. మేము ఎంత కష్టపడ్డా సరే, నీ భవిష్యత్తు బాగుండాలి.” రాము రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు. చాలాసార్లు దీపం లేక, చిన్న నూనె దీపం వెలుగులోనే చదివేవాడు. అతని కల ఏమిటి అంటే పెద్ద ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను గర్వపడేలా చేయడం. కాలం గడిచింది. పదో తరగతి పరీక్షల్లో రాము ఊరిలో మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ రోజు తల్లి ఆనందంతో కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పింది: “బిడ్డా, నువ్వు మా గర్వం” అని.. అతని చదువు కొనసాగడానికి డబ్బులు అవసరమయ్యాయి. తండ్రి అప్పులు చేసి, పొలాన్ని తాకట్టు పెట్టి అయినా చదివించాడు. తండ్రి ఒక మాట చెప్పాడు: “రాము, మనం కష్టపడతాం. నువ్వు చదువుతో మా త్యాగాలకు న్యాయం చెయ్.” అని.. రాము నగరానికి వెళ్ళాడు. అక్కడ చదువుకోవడం సులభం కాదు. ఆకలి దప్పికతో చాలా రోజులు గడిపాడు. పక్కగా పని చేసి, లైబ్రరీలో రాత్రులు మేల్కొని చదివాడు. చాలామంది అతనిని ఎగతాళి చేశారు: “నీ లాంటి పేదవాడు డాక్టర్ అవుతాడా?” అని.. కానీ రాము ఒకే మాట గుర్తుపెట్టుకున్నాడు – “తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నప్పుడు అసాధ్యం ఏదీ లేదు.” ఏళ్ళ తరబడి కష్టం చేసిన తర్వాత, చివరకు రాము పెద్ద పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అతను డాక్టర్ అయ్యాడు. ఆ రోజు గ్రామానికి తిరిగి వచ్చి తన తల్లిదండ్రుల కాళ్ల దగ్గర కూర్చున్నాడు. “అమ్మా, నాన్నా… మీ త్యాగాల వల్లే నేను ఇక్కడికి చేరుకున్నాను. ఈ డాక్టరు బిరుదు మీది అని కన్నీరు పెట్టుకున్నాడు. తల్లి తలమీద చేయి వేసి, తండ్రి గర్వంగా నవ్వి ఒకే మాట చెప్పారు: “నువ్వు డాక్టర్ మాత్రమే కాదు రాము… మా జీవితానికి అర్థం.” కొడుకును హత్తుకుని సంతోష గర్వంతో పొంగిపోయారు. పేదరికం, కష్టాలు, అడ్డంకులు – ఇవన్నీ జీవితంలో వస్తాయి. కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, మన కష్టపడే తపన ఉంటే… మన కలలు ఎప్పటికైనా నెరవేరుతాయి…….. ఇక కథ కంచికి మనం ఇంటికీ……
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Story
Hyderabad
Need help