Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
కాఫీ షాప్ లవ్ స్టోరి
Talent:
ప్రేమ ఎప్పుడు పుడుతుందో.. ఎందుకు పుడుతుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు అది ఒక చూపులో మొదలవుతుంది… మరికొన్నిసార్లు ఒక చిన్న మాటలో, ఒక చిన్న కాఫీ కప్పులో మొదలవుతుంది. “ఇది అనంత్ , మాయ ల కథ. అనంత్ సాదాసీదా అబ్బాయి. చదువులో బాగానే ఉన్నా… హృదయం మాత్రం ఎప్పుడూ కవితలతో నిండిపోతుంటుంది. ప్రతీదాంట్లోనూ ఒక అందం వెతుక్కుంటాడు. అలాగే ఇది మాయా… చురుకైన, సరదా గల అమ్మాయి. ఆమెను చూసిన ప్రతీ ఒక్కరూ ఒకసారి వెనక్కి తిరిగి చూడక మానరు. కానీ ఆమె మనసు మాత్రం ఎవరిపట్లా మనసు చంచలం చేసుకోదు. ఒక రోజు అనంత్ లైబ్రరీ నుండి బయటకు వస్తూ… చేతిలో పుస్తకాల కుప్పతో తడబడిపోతాడు. ఆ పుస్తకాలు అన్నీ కింద పడిపోతాయి. అప్పుడు… ఎవరో ఒక చేయి ఆ పుస్తకాలను ఎత్తడంలో సహాయం చేస్తుంది. ఆమె పేరే మాయా. అనంత్ ఆ ఒక్క క్షణం ఆమె కళ్లలోకి చూసాడు… అక్కడే అతనికి ఏదో అయింది. అతని ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది. అప్పటి నుంచి ఆ గురించే కలలు కనేవాడు. కొన్ని రోజుల తర్వాత, కాఫీ షాప్లో మాయా తన ఫ్రెండ్స్ తో కూర్చుంది. అక్కడికే అనంత్ కూడా వచ్చాడు. కొంత ధైర్యం చేసి… మాయా టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అనంత్త్ తడబడుతూ ఇలా అన్నాడు.. “హాయ్… నేను అనంత్.. ఒక కప్పు కాఫీతో పరిచయం మొదలు పెడదామా?” అందుకు మాయా నవ్వుతూ: “నువ్వు కాఫీ తాగాలనుకుంటున్నావా లేక నన్ను కలవాలనుకుంటున్నావా?” సూటిగా చూస్తూ అడిగింది. ఆ సమాధానం ఆరవ్ని ఆశ్చర్యపరిచింది… కానీ అది మొదటి మాటల మాయే అనిపించింది. అంగీకరించినట్లు గా చిరునవ్వు నవ్వింది. ఒక కప్పు కాఫీ తర్వాత… ఎన్నో కప్పులు కాఫీ తాగారు. ప్రతీ కలిసిన ప్రతి సారి, వాళ్ల మనసులు దగ్గరవుతూనే వచ్చాయి. క్యాంపస్లో వర్షం కురిసినప్పుడు ఒకే గొడుగులో నడిచిన సందర్భాలు… లైబ్రరీలో పుస్తకం కోసం ఒకేసారి చేయి వేసిన క్షణాలు… ఇవన్నీ వాళ్ల ప్రేమకథను క్రమంగా రెట్టింపును చేసాయి. కానీ ప్రతీ ప్రేమకథలోనూ ఒక పరీక్ష ఉంటుంది. కాలేజ్ చివరి రోజున, మాయా అనంత్ తో ఇలా చెప్పింది… “అనంత్ … నాకొక అవకాశం వచ్చింది. నేను లండన్ వెళ్ళాలి. నా డ్రీమ్ కూడా అదే .. కానీ… నువ్వు ఇక్కడ నేను అక్కడ.. ఇప్పుడు ఏం చేద్దాం” అని అడిగింది. అనంత్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు.. కొంచెం సేపు తర్వాత నవ్వుతూ ఇలా అన్నాడు “మాయా, కలలు వెంబడించు. మన ప్రేమ ఎక్కడికీ పోదు. మనం కలుసుకునేది కేవలం ఒక కప్పు కాఫీ దగ్గర కాదు… మన హృదయాల్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.” అలా ఇద్దరు అనుకొని మనస్పూర్తి గా ఆలింగనం చేసుకున్నారు. మాయా బయలుదేరే ముందు… వాళ్లిద్దరూ ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. చివరి క్షణంలో మాయా కళ్లలో కన్నీళ్లు… కానీ హృదయంలో నమ్మకం.. మాయా.. అనంత్ ను చూస్తూ.. ఇలా అంది.। “ఒక కప్పు కాఫీతో మొదలైన ఈ బంధం… ఎప్పటికీ కొనసాగుతుందా?” అని.। అనంత్ చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. “మాయా… కాఫీ చల్లారిపోతుంది కానీ మన ప్రేమ ఎప్పటికీ వేడిగా ఉంటుంది.” నవ్వుతూ అన్నాడు. అలా… ఒక కప్పు కాఫీతో మొదలైన ఈ ప్రేమకథ… కాలం, దూరం, కష్టాలను దాటుకుని… ఒకరినొకరు నమ్ముకున్న ఇద్దరి హృదయాలకథగా నిలిచిపోయింది. ఇద్దరూ తమ గమ్యాలను చేరుకున్న తర్వాత పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా జీవించారు. ప్రేమ పుట్టటం అందరికీ చాలా ఈజీగానే జరుగుతుంది. కానీ దానిని కొంత మంది మాత్రమే నిలబెట్టుకొని జీవితం లో విజయం సాదిస్తారు. దయచేసి మీరు అందరూ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్ క్రైబ్ చేసుకోవాలని మనవి. ఇక కథ కంచికి మనం ఇంటికి.
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Story
Hyderabad
Need help