Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
మహానుభావ ఓ బావ
Talent:
పల్లవి : (ఆమె) మహానుభావా ఓ బావా నా బావా ననుమైమరిపించే నా బావా ఓ బావా ఇది విన్నావా నువ్వు అన్నావు నువ్వు అంటేనే నే ఉన్నాను నే వేచుంటాను నీ కొరకై నే కాచుంటాను కడ వరకై అని చరణం : 1 (ఆమె) వాకిట్లో నిలబడి నువ్వు ముచ్చట్లు పెడితే నీ హాస్యం సునామిలా పొంగునులే.. ఎవరైనా నిన్ను సీరియస్ గా చూస్తే నీ పరిహాసంతో ఆ కోపాలు పటా పంచలే నీకేంటి బావా నీదంతా యమ రాయల్ స్టైలు నిన్ను ఎవరైనా చూస్తే ఆ పెదవుల పై వచ్చును స్మైలు నువ్వు నా వాడివంటూ కట్టెను వనితలు క్యూలు ఆ వనితల వలలో చిక్కెదవని పట్టెను నాకు దిగులు పల్లవి : (ఆమె) మహానుభావా ఓ బావా నా బావా ననుమైమరిపించే నా బావా ఓ బావా ఇది విన్నావా నువ్వు అన్నావు నువ్వు అంటేనే నే ఉన్నాను నే వేచుంటాను నీ కొరకై నే కాచుంటాను కడ వరకై అని చరణం : 2 (ఆమె) కొత్తలో కొంతలొ కొంతైనా నన్నూ ఆలకించదువే అంతలో ఇంతలో మరి ఎందుకో నన్ను వదిలెల్లావే ఈ ముద్దుల మరదల పిల్లకు బావే జోడని అన్నావే హద్దులు దాటిన ప్రేమలో ముంచి మురిపించినావే నీకేంటి బావా నీదంతా యమ రాయల్ స్టైలు నిన్ను ఎవరైనా చూస్తే ఆ పెదవులపై వచ్చును స్మైలు నాకేంటి బావా నా ధైర్యం నాకు నువ్వున్నావు మూడు ముళ్ళై బావా అంటేనూ దూరమెళ్ళిపోయావు పల్లవి : (ఆమె) మహానుభావా ఓ బావా నా బావా ననుమైమరిపించే నా బావా ఓ బావా ఇది విన్నావా నువ్వు అన్నావు నువ్వు అంటేనే నే ఉన్నాను నే వేచుంటాను నీ కొరకై నే కాచుంటాను కడ వరకై అని
Like (
0
)
Share
Basireddy Sivareddy MA.RD
Lyrics
Hyderabad
Need help