Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
అన్నా తమ్ముడు
Talent:
ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో దేవుడయ్య అనే రైతు ఉండేవాడు. కష్టపడి పొలం దున్నేవాడు, చెమటోడ్చి కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు సతీష్.. చాలా తెలివిగలవాడు. కానీ స్వార్థపరుడు. చిన్న కొడుకు పేరు రాజు. కానీ మంచి మనసున్న వాడు. గ్రామంలో అందరూ రాజును ఇష్టపడేవారు. ఎందుకంటే రాజు ఎప్పుడూ సహాయం చేయడానికే ముందుండేవాడు. కానీ సతీష్ ఎప్పుడూ తనకే లాభముంటేనే కదిలేవాడు. ఒక సంవత్సరం భీకర వర్షాలు పడ్డాయి. పంటలు పాడైపోయాయి. రామయ్య అప్పుల్లో కూరుకుపోయాడు. ఇంట్లో ఆహారం కూడా సరిపడకుండా పోయింది. అలాంటి సమయంలో .. ఒక వృద్ధుడు గ్రామానికి వచ్చాడు. ఆకలితో వణికుతూ, “నాయనలారా … నాకు కొంచెం అన్నం ఇస్తారా?” అని అడిగాడు. సతీష్ కోపంగా ఇలా అన్నాడు. “మాకు సరిపడదే లేదు. నీకు ఇవ్వడానికి ఏముంది?” అన్నాడు. కానీ రాజు మాత్రం తన పాత్రలో ఉన్న చిన్న ముద్ద అన్నం తీసుకుని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఆనందంగా తిని, రాజును ఆశీర్వదించాడు: “బిడ్డా, నీ మంచి మనసు నీకు ఎప్పుడో ఒక రోజు పెద్ద ఫలితం ఇస్తుంది” అని. సంవత్సరాలు గడిచాయి. రామయ్య మరణించాడు. ఇద్దరు అన్నదమ్ములు తమ జీవితం తమదైన రీతిలో గడపసాగారు. సతీష్ డబ్బు కోసం ఎక్కడా ఎలాంటి పనైనా చేసేవాడు. కానీ స్వార్థం వల్ల అందరితో దూరమయ్యాడు. రాజు మాత్రం కష్టపడి పనిచేసి, దొరికినంతలో పంచుకుంటూ జీవించాడు. అతనికి గ్రామంలో మంచి పేరు వచ్చింది. ఒక రోజు గ్రామానికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. అతను కొంతమంది గ్రామ పెద్దలతో వాకబు చెయ్యటం ప్రారంభించాడు. “ఇక్కడ ఎవరి మీద నమ్మకం ఉంచితే, నా వ్యాపారం బాగా నడుస్తుంది?” అని చాలామంది ని అడిగారు. అందరూ ఒకే మాట చెప్పారు. “రాజు మీదే నమ్మకం పెట్టుకోండి. అతను నిజాయితీ గలవాడు.” అందరూ రాజు పేరే చెప్పారు. వ్యాపారి రాజుకి పెద్ద బాధ్యత ఇచ్చాడు. రాజు నిజాయితీగా పని చేసి, వ్యాపారం వృద్ధి చేసాడు. కొద్ది కాలంలో రాజు పెద్ద స్థాయికి ఎదిగాడు. ఒక రోజు ఆకలితో బాధపడుతూ సతీష్ అతని దగ్గరకు వచ్చాడు. అతను తలను వంచుకుని అన్నాడు: “నన్ను క్షమించు తమ్ముడా… నేను తప్పు చేశాను. నువ్వు చేసిన మంచిని నేను ఎప్పుడూ చిన్నచూపు చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది – మనసు మంచిగా ఉంటేనే జీవితం మంచిగా మారుతుంది.” అని. రాజు చిరునవ్వుతో అన్నాడు: “అన్నా… నువ్వు నా అన్నవు కదా. నేను నిన్ను ఎప్పుడూ వదలను. రా, మనం కలసి జీవిద్దాం.” అని అన్నను చేరదీసాడు. “సంపదలు, స్థాయులు, డబ్బు ఇవన్నీ తాత్కాలికం. కానీ మంచి మనసు, నిజాయితీ, సహాయం – ఇవే జీవితాంతం నిలిచే ధనం. మనిషి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా, మంచితనం లేకపోతే విలువ ఉండదు. మంచి మనసుతో ఉంటే, సమాజం మనకు గౌరవం ఇస్తుంది. అదే నిజమైన సంపద.” దయచేసి మీరు అందరూ మన యూట్యూబ్ ఛానెల్ ను Subscribe చేసుకోగలరని మనవి. ఇక కథ కంచికి మనం ఇంటికి.
Like (
5
)
Share
Basireddy Sivareddy
Story
Hyderabad
Need help