Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
రాజమహల్ లో రాజ్యలక్ష్మి
Talent:
అర్ధరాత్రి పన్నెండు గంటలు.. చందమామ మబ్బుల వెనుక దాగిపోతూ ఉంది. కర్నూలు జిల్లాలోని ఒక పాత రాజమహల్ ఉంది. దశాబ్దాలుగా ఖాళీగా ఉంది అని అందరూ చెబుతూ ఉంటారు. ఆ రాజమహల్లో “కామ పిశాచి” సంచరిస్తుందని కథలు కథలుగా చెప్ప్పకునేవారు. ఒకప్పుడు ఆ ఇల్లు రాజలక్ష్మి దేవిదీ అని, రాజ్యలక్ష్మి ఎంతో అందం, సంపద, మోహం కలగలసిన ఆడదేవతలా ఉండేది. కానీ ఆమె జీవితంలో ఒకే ఒక తప్పు చేసింది. ప్రేమ కోసం పాపం చేసింది. తన సేవకుడైన రఘును ప్రేమించింది. అతడిని మోసం చేసి మరొకడుని పెళ్లి చేసుకుంది. ఆ రాత్రి రఘు ఆత్మహత్య చేసుకున్నాడు… కానీ చావుకన్నా ముందు ఒక మాట అన్నాడు. “నువ్వు ఈ లోకంలో ఎవరికీ సుఖం ఇవ్వలేవు రాజలక్ష్మీ… నీ కామమే నీ శాపం అవుతుంది!” అని శాపం పెట్టాడు. ఆ రాత్రి నుంచే రాజలక్ష్మి కూడా చనిపోయి కామ పిశాచి అయింది అని అందరూ ఆ రాజమహల్ రాజలక్ష్మి గురించి చెప్పుకుంటూ ఉండేవారు…. ఇదిలా ఉండగా…… హైదరాబాద్ నుంచి వచ్చిన ఐదుగురు ఫ్రెండ్స్ ఫోటోగ్రఫీ కోసం ఆ రాజమహల్ల్ కి వెళ్తారు. వారిలో ఒకరు విహాన్, ఎప్పుడూ చమత్కారంగా మాట్లాడే యువకుడు. అతనికి ఆ పాత చిత్రపటం లోని రాజలక్ష్మి ఫోటో చాలా ఆకర్షణగా కనిపిస్తుంది. “ఇంత అందం… ఇంత ఆకర్షణ… పిశాచి అయినా సరే, ప్రేమిస్తా నేను!” అంటూ విహాన్ గట్టిగా నవ్వుతాడు. రాత్రి 1 గంటకి, విహాన్ ఒంటరిగా ఫోటోలు తీస్తూ తిరుగుతాడు. మహల్ లోని అద్దం ముందు ఒక మృదువైన సువాసన వస్తుంది… మెల్లగా అద్దంలో.. ఎర్ర సారీ, జుట్టు ఊదుతూ, కళ్ళలో మోహంతో రాజలక్ష్మి కనపడుతుంది. విహాన్ తో కామంతో ఇలా అంది “నన్ను చూశావు కదా విహాన్… ఇప్పుడు నన్ను విడిచి పోవలేవు…నా కామ వలయం లో చిక్కుకొని స్వర్గ సుఖాలును అనుభవించు” అని మెత్తని గమ్మత్తైన మాటలు చెప్పి, విహాన్ ను మృదువుగా తాకింది. అతనికి ఆమె అద్భుతంగా కనిపిస్తుంది . స్పర్శలో మత్తు, చూపులో జ్వాల. విహాన్ మోహంలో మునిగిపోతాడు. కానీ ఆ ముద్దు క్షణంలోనే అతనికి చల్లటి శ్వాస గమనమవుతుంది. మెల్లగా ఆమె ముఖం ఎముకల మాదిరిగా మారుతుంది… రక్తంతో నిండిన కళ్ళు విహాన్ వైపు చూస్తాయి. ఇద్దరూ ఒక్కటి అవుతారు. విహాన్ మోహం నుండి తేరుకొని రాజలక్ష్మి ని చూసాడు. రాజలక్ష్మి కామ పిచాచిలా మారింది. విహాన్ ను గట్టిగా పట్టుకుని ఇలా అంది. “నువ్వు నా కోరిక తీర్చావు… ఇప్పుడు నీ ఆత్మ నా సొత్తు!” అనగానే.. వీహాన్ ధైర్యం తెచ్చుకుని చీకట్లో కేకలు వేస్తాడు… తరువాతి రోజు ఉదయం, అతని ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం కెమెరా మాత్రమే కనిపిస్తుంది. కెమెరాలో చివరి ఫోటో విహాన్ ఒక స్త్రీతో నిలబడి ఉన్నాడు… కానీ ఆమె ముఖం అద్దంలోనే కనిపిస్తోంది. ఇప్పటికీ ఆ రాజమహల్లో రాత్రి పన్నెండు అయింది అంటే.. ఎర్ర సారీ కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని పూల వాసనతో రాజమహల్ లో రాజలక్ష్మి తిరుగుతూ ఉంటుంది. ఆ మహల్ నిండా రాజలక్ష్మి ఎంతో అందంగా కనిపించే ఫోటోలు ఉంటాయి. ఎవరైనా ఆ మహల్ లోకి వెళ్లి ఆ ఆ ఫోటోలోని రాజలక్ష్మి ని చూసి “ఎంత అందంగా ఉంది” అని అంటే చాలు.. వారి ప్రాణం ఆమె కామానికి తదుపరి ఆహారం అయిపోతారు. ఇంతటితో కథ సమాప్తం. దయచేసి అందరూ మన యూట్యూబ్ ఛానెల్ ని Subscribe చేసుకోగలరు అని మనవి! ఇక కథ కంచికీ.. మనం ఇంటికి!
Like (
2
)
Share
Basireddy Sivareddy
Story
Hyderabad
Need help