Chance Dekho
Login
Chance Dekho
Login
World will See
Your Talent
Talent Title:
రక్త సంబంధం
Talent:
రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. పల్లె వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. దూరంలో మోగుతున్న చర్చిగంట శబ్దం వినిపిస్తోంది. ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ, ఒక సైకిల్ లైట్ చీకటిలో కదిలింది. ఆ సైకిల్ మీద యాబై సంవత్సరాల వయసు ఉన్న రామదాసు పట్నంలో ఉన్న తన కొడుకు దగ్గరకు వెళుతున్నాడు. రామదాసు తలలో మాత్రం ఒకే ఆలోచన గిర్రున తిరుగుతోంది. ఈరోజు ఎలాగైనా నా కొడుకును తప్పకుండా కలుస్తాను అని అనుకున్నాడు. ఒకప్పుడు అతని గర్వకారణమైన కొడుకు సతీష్, ఇప్పుడు నగరంలో పిల్లాపాపలతో సెటిల్ అయ్యాడు. తండ్రి రామదాసును సతీష్ అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఫోన్ చేసినా ఎత్తేవాడు కాదు. కానీ రామదాసు మాత్రం ప్రతి పండుగరోజు కొడుకు కోసం అతని గుమ్మం ముందుకు వెళ్తాడు. రేపే సంక్రాంతి పండుగ కావటంతో తన కొడుకుకు పిండి వంటలు చేయించుకొని తన సైకిల్ బస్టాండ్ వరకు వచ్చాడు. సైకిల్ పక్కన పెట్టి బస్సు ఎక్కాడు. మూడు గంటల ప్రయాణం తర్వాత నగరంలోని పెద్ద గేటు ముందు దిగాడు. అక్కడే సతీష్ ఇల్లు. డబ్బు బాగా సంపాదించి ఉన్నతంగా సెటిల్ అయ్యాడు. గేటు వద్ద సెక్యూరిటీ రామదాస్ దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు “ఎవర్ని కావాలి?” అని. “బాబు సతీష్ గారిని కలవాలి.. చెబుతావా రామదాసు వచ్చాడని?” అన్నాడు. సెక్యూరిటీ లోపలికి వెళ్లి ఒక కవరుతో భయటకు వచ్చాడు. “సార్ మీ బాబుకి మీ గురించి చెప్పానండి… ఆయన బిజీగా ఉన్నారు. మీకో ప్యాకెట్ ఇచ్చి పంపమన్నారు.” అని అన్నాడు. రామదాసు చిరునవ్వు నవ్వి ప్యాకెట్ తీసుకున్నాడు. అందులో కొత్త చొక్కా, 500 రూపాయల నోట్, ఒక కాగితం ఉంది. కాగితం మీద ఇలా రాసి ఉంది – “నాన్నా, మీరు రావొద్దు. నాకు సిగ్గేస్తుంది. దయచేసి గ్రామంలోనే ఉండండి.” అని అందులో ఉంది. రామయ్దాసు కళ్లలో నీరు… ఆకాశంలో వాన. తిరుగు ప్రయాణం అయ్యాడు. రొడ్డు మీద నడుస్తూ తిరిగి బయలుదేరాడు. మార్గమధ్యంలో రోడ్డు పక్కన ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. వానలో తడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని రామదాసు చూసాడు. ఆ పాపను దగ్గరికి తీసుకుంటూ “ఏమయ్యింది బంగారం?” – అడిగాడు. “ఇంత పెద్ద వర్షంలో మా ఇల్లు మర్చిపోయాను..మా డాడి పేరు సతీశ్, మా మమ్మీ పేరు అనసూయ” అని చెప్పాడు. రామయ్య తనలో నవ్వుకున్నాడు. “ఎందుకీ ఏడుపు… రా బంగారం, మన ఊరికి తీసుకెళ్తా” అని పాపను తన ఇంటికి తెచ్చుకున్నాడు. రాత్రి గాలులు ఉరుములు. రామదాసు తన మనవరాలిని తీసుకెళ్ళి తడిసిన బట్టలు మార్చి, పొయ్యి దగ్గర కూర్చోపెట్టాడు. మనవరాలి పేరు చిన్నూ. రామదాసు తన గదిలోని పాత ఫొటో చూస్తూ చెప్పాడు –“నా కొడుకూ చిన్నప్పుడే ఇలానే ఉండేవాడు… చిలిపిగా, ముద్దుగా.” అన్నాడు. “ఇప్పుడు నీ కొడుకు నీతో లేడా” అని మనవరాలు అడిగేసరికి రామదాసు కల్లలో నీళ్ళు తిరిగాయి. రామదాసు తన మనవరాలిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి తనకు ఈ పాప దొరికింది అని చెప్తాడు. అప్పటికే తన కూతురు కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చిన సతీష్ పరుగునా స్టేషన్ కు వచ్చి, తన తండ్రే తన కూతురిని పోలీసులకు అప్పగించాడు అని తెలుసుకుంటాడు. రామదాసు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. కొద్ది సేపటికి సతీష్ రామదాసు దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ల మీద పడి ఏడుస్తూ ఇలా అన్నాడు. “నాన్నా!” అని మొదటిసారి గట్టిగా ఏడ్చాడు. “నన్ను క్షమించండి… మీరు లేకపోతే నా పిల్లని నేను కోల్పోయేవాడిని.” అని ఏడుస్తూనే ఉన్నాడు. రామదాసు కళ్లలో కన్నీరు జలజలా జారింది. కానీ ఈసారి ఆనందంతో.. కొడుకును మనవరాలిని దగ్గరకు తీసుకున్నాడు. జీవితం ఎంత దూరం తీసుకెళ్లినా… రక్తబంధం ఒక్కసారి పలకరించగానే అన్ని అడ్డు గోడలూ కూలిపోతాయి. రక్త సంబంధీకులు మధ్య ఎన్ని గొడవలు అయినా ఉండొచ్చు. కానీ మీరు ఒక్క సారి పలకరించి చూడండి. అన్ని అవాంతరాలు పోతాయి. రక్త సంబంధం అంటే ఇదేనేమో! ఇది ఒక్క రామదాసు కథ కాదు — మనలో ప్రతి తండ్రి, ప్రతి కొడుకు కథ. రక్త సంబంధం కలిగిన వారి అందరి కథ. ఇంతటితో కథ సమాప్తం. ఇక కథ కంచికి మనం ఇంటికి.
Like (
2
)
Share
Sivareddy
Story
Kadapa
Need help